తణుకులో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మహనీయుల అడుగుజాడల్లో నడుచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.