ఇరగవరం గ్రామంలో గురువారం కేశవస్వామి గుడి వద్ద నిర్వహించిన మండల తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల కమిటీ అధ్యక్షుడుగా ఎన్నికైన గూడూరి నాగరాజు, సెక్రెటరీ పోతిరెడ్డి శ్రీనివాస్ కు ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ మరింత కష్టపడి పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.