ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకొని భారత సాయుధ దళాల పట్ల ప్రజలు కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరిచే రాజకీయతర ఉద్యమం దేశవ్యాప్తంగా చేపడుతుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ గురువారం తెలిపారు. 18న తణుకులో ఉదయం 8 గంటలకు మున్సిపల్ కార్యాలయం నుంచి వెంకటేశ్వర సెంటర్ వరకు తిరంగా యాత్ర జరుగుతుందని చెప్పారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల పట్ల గౌరవాన్ని వ్యక్తపరిచే విధంగా ఈ యాత్ర ఉంటుందన్నారు.