జూన్ 15న తణుకు కామ్రేడ్ వంక సత్యనారాయణ సురాజ్య భవన్ లో అగ్రిగోల్డ్ కష్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా సమావేశం జరుగుతుందని అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు అన్నారు. ఈ సందర్భంగా గురువారం భీమవరంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్స్ అందరూ హజరు కావాలని కోరారు.