ఇంటర్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో తణుకు పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ కు చెందిన విద్యార్థులు ఏ గ్రేడ్ సాధించి ఉత్తమ ప్రతిభను కనపరిచారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి వారందర్నీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే మన తణుకు పట్టణంలో ఉత్తమ ప్రతిభను సాధించిన వారందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.