అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించే విధంగా తణుకు నియోజకవర్గ విజన్ ప్లాన్ తయారు చేసి 2047 నాటికి లక్ష్యం చేసుకుని ఆదాయ వనరులు పెంచే విధంగా కసరత్తు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. సోమవారం తణుకు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర విజన్ 2047 అంశంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు.