ఈ నెల 18 నుంచి 20 వరకు తణుకు మహిళా కళాశాల చిట్టూరి సుబ్బారావు, గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ వద్ద జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ సెలక్షన్స్ కమ్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు చిట్టూరి ఉషారాణి శనివారం తెలిపారు. ఈ పోటీల్లో అండర్ 11, 13, 15, 17, 19 బాల బాలికలకు, పురుషులకు, మహిళలు అలాగే వెటరన్స్ 35- 70 వయసుల విభాగాల్లో సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ పోటీలు ఉంటాయన్నారు.