కూటమి ఏడాది పాలనపై మాజీ మంత్రి, తణుకు మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తణుకు పద్మశ్రీ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయలేదని అన్నారు.