రైతులను ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు శుక్రవారం ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను పత్రికలు పెద్ద ఎత్తున ప్రచురిస్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో రైతులు ఆర్తనాదాలు దేశవ్యాప్తంగా వినపడుతున్నాయని ఆయన అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.