తణుకు మండలం మండపాక గ్రామంలో ప్రసిద్ధ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ ఎల్లారమ్మ అమ్మవారి వసంతోత్సవాలలో భాగంగా, జాతర మహోత్సవ కార్యక్రమం శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుంచీ అమ్మవారికి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాత్రి జాతర కార్యక్రమం నిర్వహించారు. ఈఓ సూర్యనారాయణ, అర్చక బృందం, స్థానిక పెద్దలు ఏర్పాట్లు పర్యవేక్షించారు.