తణుకు: దళితుల పై దాడులకు పాల్పడిన ఘనత జగన్ కే దక్కుతుంది

65చూసినవారు
తణుకు లో సుమారు 4 కోట్లు విలువైన అభివృద్ధి పనులను రాష్ట్ర హోం మంత్రి అనిత మంగళవారం ప్రారంభించారు.   మంత్రి అనిత మాట్లాడుతూ జగన్ మోహనరెడ్డి దళితులను లక్ష్యంగా చేసుకుని వారిపై దాడులకు పాల్పడినట్లు ఆరోపించారు. డాక్టర్ సుధాకర్‌ను చిత్రహింసలకు గురి చేసారని, దళితుల ఓట్లతో గెలిచిన జగన్ అధికారంలోకి వచ్చాక వారి పతనమే లక్ష్యంగా పని చేశారని విమర్శించారు. టీడీఆర్‌ బాండ్లు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న  కారుమూరి వెంకటనాగేశ్వరరావు నియోజకవర్గ ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొన్నారని ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్