తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త దాన శిబిరాన్ని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ శుక్రవారం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ కమిటీ మెంబర్స్, కూటమి నాయకులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియని ఈ రోజుల్లో మనం చేసే ఈ రక్తదానం ఒకరి ప్రాణాన్ని కాపాడే అవకాశం ఇస్తుందన్నారు.