సేవే లక్ష్యం ప్రేమే మార్గం అనే నినాదంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన అభిమానులు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. ప్రజలు అవసరాలను గుర్తించి వాటిని పరిష్కరించడానికి పవన్ కళ్యాణ్, ఆయన అభిమానులు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారని చెప్పారు. శనివారం తణుకులో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు.