తణుకు పురపాలక సంఘ ఆధ్వర్యంలో తణుకు పట్టణంలో ఆదివారం ఐదు ప్రాంతాల్లో ఐదు చలివేంద్ర కేంద్రాలను స్థానిక శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలమే మనకు జీవన ఆధారమని అలాగే వేసవికాలం నేపథ్యంలో బాటచారులకు, ప్రయాణికులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఉపకరించే గొప్ప నేస్తాలు చలివేంద్రాలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు.