పాలీసెట్ ఫలితాల్లో 120 మార్కులకు గాను 120 సాధించి రాష్ట్రస్థాయిలో 18వ ర్యాంకు పొందిన తణుకుకి చెందిన యశ్వంత్ పవన్ సాయిరాంను తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అభినందించారు. గురువారం తణుకులోనే రామకృష్ణ సేవా సమితిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాయిరాంను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రూట్స్ స్కూల్ డైరెక్టర్లు ఎల్ కే త్రిపాఠి, విద్యా కాంత్, సుధాకర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.