తిరుమల తిరుపతి దేవస్థానంపై వైసీపీ నాయకులు దుష్ప్రచారం సరికాదని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఆదివారం తణుకులో మీడియాతో మాట్లాడారు. గోశాలలో వంద గోవులు మృత్యువాత పడ్డాయని నిరాధారమైన ఆరోపణలు చేసిన భూమన కరుణాకరరెడ్డిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే రాధాకృష్ణ తీవ్రంగా ఖండించారు.