తణుకు మండలం మండపాక గ్రామంలో శనివారం ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని శ్రీ చక్ర రాజ సహిత శ్రీ యల్లారమ్మ వారి వార్షికోత్సవాలు మరియు తీర్థము అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగింది.