తణుకు పట్టణ పరిధిలోని ఇరగవరం రోడ్డు నందు 11, 12 వార్డులలో బుధవారం ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలకు మౌలిక సదుపాయాలైన పారిశుధ్యం, తాగునీరు, డ్రైన్లు, రోడ్లు, విద్యుత్ దీపాలు, ఖాళీ స్థలాలు, మున్సిపల్ లేఅవుట్లు, మున్సిపల్ పార్కులు ఇతర సదుపాయాల గురించి మున్సిపల్ కమిషనర్ తో అనంతరం ప్రజల వద్ద నుండి స్వీకరించిన సమస్యలకు తగిన పరిష్కారాలు చేయవలసిందిగా సూచనలు చేయడం జరిగింది.