రాష్ట్రంలో అన్ని కోర్టుల పరిధిలో జులై 5న జాతీయ లోక్ అదా లత్ నిర్వహిస్తున్నట్లు తణుకు 4వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి. సత్యవతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజీపడే క్రిమినల్, ఎక్సైజ్, చెక్ బౌన్స్, ప్రోనోట్, అన్ని రకాల సివిల్ కేసులను లోక్అదాలత్లో రాజీ చేస్తారని చెప్పారు. పోలీసు అధికారులు కక్షిదారులకు కౌన్సెలింగ్ ఇచ్చి రాజీ చేయాలన్నారు. తద్వారా సమయం, నగదు ఆదా చేసుకోవచ్చని తెలిపారు.