తణుకు: మురుగుతో గ్రామస్తులకు తప్పని అవస్థలు

61చూసినవారు
తణుకు: మురుగుతో గ్రామస్తులకు తప్పని అవస్థలు
తణుకు మండలం దువ్వ గ్రామంలో పారిశుధ్యం అద్వానంగా మారింది. మండలంలో మేజర్ గ్రామం అదే రీతిలో సమస్యలు తాండవిస్తున్నాయి. గ్రామంలో ప్రధానంగా గ్రామస్తులను డ్రైనేజీ సమస్య వేధిస్తోంది. మురుగునీటి పారుదల సక్రమంగా లేక దుర్వాసన వ్యాపించి దోమలు విజృంభిస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. దీంతో తరచూ అనారోగ్య పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  అధికారులు స్పందించి సత్యం జిల్లా పూడిక తొలగించి మురుగునీటి పారుదలకు కృషి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్