తణుకు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులతో కిటకిటలాడుతుంది. వేకువజామునే స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులు దర్శించుకునే ప్రత్యేక పూజలు చేశారు. అలాగే అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాటు చేశారు.