కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే రెట్టింపు సంక్షేమాన్ని అందించిందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. శనివారం తణుకులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే తల్లికి వందనం పథకం అమలు చేయగా జూన్ 20న అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఓకే నెలలో రెండు పథకాలు అమలు చేసిన చంద్రబాబు దేశంలోనే చరిత్ర సృష్టించారన్నారు.