టిడిపి–జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఆరిమిల్లి రాధాకృష్ణ పేరును అధిష్టానం ఖరారు చేయడంతో తణుకు జనసేనలో ఆగ్రహం పెల్లుబికింది. పార్టీ జిల్లా నాయకులు విడివాడ రామచంద్రరరావును బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ పార్టీ శ్రేణులు ససేమిరా అంటున్నారు. దీంతో జనసేనకు గుడ్‌బై చెప్పే యోచనలో విడివాడ ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అనుచరులు చెబుతున్నారు.