భార్యను కడతేర్చి ఆపై భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం ఉండి మండలం కలిగొట్ల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం భూపతి సత్యవతి(36) భర్త చిరంజీవి భార్యపై అనుమానంతో తరచూ గొడవలు పడుతుండేవాడు. ఈ క్రమంలో భార్య నిద్రిస్తున్న సమయంలో ఆమె ముఖంపై దిండు వేసి హత్య చేసి బంధువులకు ఫోన్ చేసి చెప్పాడు. అనంతరం అతను ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.