ఆకివీడు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ స్టేషన్ పరిధిలోని కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామానికి చెందిన కోలా ఆంజనేయులు నుంచి శనివారం 6 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఎస్ఐ కరుణ ప్రియ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేశామని వెల్లడించారు. ఎవరైనా అక్రమంగా మద్యం సీసాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. అక్రమ మద్యం విక్రయాలపై నిరంతరం నిఘా పెంచుతున్నామని ఎస్ఐ వివరించారు.