ఆకివీడు: ప్రమాదవశాత్తు గడ్డి ట్రాక్టర్ దగ్ధం

70చూసినవారు
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం సిద్దాపురం ప్రధాన రహదారిపై బుధవారం ప్రమాదవశాత్తు గడ్డి ట్రాక్టర్ దగ్ధమైంది. అయితే ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది. వెంటనే స్పందించిన స్థానికులు నీటితో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో ట్రాక్టర్ పై ఉన్న గడ్డి పూర్తిగా దగ్ధమైంది. అలాగే ట్రాక్టర్ ట్రక్కు దగ్దం కాగా ఇంజన్ ను డ్రైవర్ తప్పించాడు.

సంబంధిత పోస్ట్