ఆకివీడు: అత్యాచారం కేసులో నిందితుడికి రిమాండ్

60చూసినవారు
ఆకివీడు: అత్యాచారం కేసులో నిందితుడికి రిమాండ్
ఆకివీడులో 7 ఏళ్ల చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డ ఘటనలో సంత మార్కెట్ ప్రాంతానికి చెందిన షేక్ మీరా సాహెబ్‌ను మంగళవారం అరెస్టు చేసినట్లు సీఐ జగదీశ్వరరావు చెప్పారు. ఉండి మండలం చెరుకువాడలోని కుమార్తె ఇంటి వద్ద ఉండగా నిందితుడ్ని అరెస్టు చేసినట్లు తెలిపారు. పోక్సో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా కోర్టు రిమాండ్ విధించిందని అన్నారు.

సంబంధిత పోస్ట్