ఆకివీడు: ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

80చూసినవారు
ఆకివీడు: ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
కూటమి ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఐటీయూ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు పెంకి అప్పారావు, కె తవీటి నాయుడులు డిమాండ్ చేశారు. ఆకివీడు ఏరియా ఆటో వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం బుధవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో జరగగా, నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా బాజీ, కొట్టాడ శ్రీను, అధ్యక్షులుగా జోగి ప్రతాప్, ప్రధాన కార్యదర్శిగా రవి, ఉపాధ్యక్షులుగా జార్జి ఎన్నికయ్యారు.

సంబంధిత పోస్ట్