ఆకివీడులో వికసిత భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ 11 ఏళ్ల అమృత పాలనలో సాధించిన అభివృద్ధి, సుపరిపాలన, సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బీజేపీ నాయకులు శనివారం సమావేశమయ్యారు. ఈ సమావేశం ఆకివీడు మండల అధ్యక్షురాలు ముదునూరి వెంకట సూర్యనారాయణ ఇంటివద్ద జరిగింది. నియోజకవర్గ కో కన్వీనర్ సాయి దుర్గరాజు, జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర రాజు, ఇతర నేతలు పాల్గొన్నారు.