ఆకివీడు మండలం మరియు ఆకివీడు పట్టణ ప్రాంతంలో ఖాళీ ప్రదేశాల్లో మద్యం సేవించుచున్న 8 మంది వ్యక్తులను ఆకివీడు ఎస్సై హనుమంతు నాగరాజు శుక్రవారం అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ సంస్థల దగ్గర గాని వాటి చుట్టుపక్కల ప్రదేశాల్లో గాని మద్యం సేవించినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.