ఆకివీడు కార్పొరేషన్ లోన్ లో అన్యాయం జరిగిందని దివ్యాంగుడు ఆకివీడు ఎంపీడీవో కార్యాలయం ఎదుట బుధవారం నిరసన చేపట్టారు. ఆకివీడు మండలం అజ్జమూరు కు చెందిన వరప్రసాద్ కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ లోన్లలో అప్లై చేసుకున్నాడు. అన్ని పత్రాలు సమర్పించిన తిరస్కరణ గురికావడంతో ఆవేదన చెంది ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. న్యాయం జరిగే వరకూ నిరసన విరమించేది లేదని భీష్మించు కూర్చోవడంతో అధికారులు న్యాయం చేస్తామని తెలిపారు.