ఉండి నియోజకవర్గ బిజెపి క్రియాశీలక సభ్యుల సమావేశం ఆదివారం జరిగింది. పార్టీ బలోపేతం పై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా పార్టీ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జ్ సుభాష్ రాజు, నియోజకవర్గం ఇంచార్జ్ కోరా రామూర్తి, తదితర బిజెపి నాయకులు పాల్గొన్నారు.