తుందుర్రు గ్రామంలో రూ.1.42 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు బుధవారం కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే రామాంజనేయులు శంకుస్థాపన చేశారు. త్వరలో తుందుర్రు–మత్స్యపురి పాలెం రోడ్డును పూర్తి చేస్తామన్నారు. స్థానికులకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులను నియమించనున్నట్లు తెలిపారు.