దాతల సహకారంతో విద్యా సామగ్రి పంపిణీ చేయడం అభినందనీయమని ఎంఇఒ ఎ. రవీంద్ర అన్నారు. పెదఅమిరం గ్రామంలో స్పెషల్ ప్రాథమిక పాఠశాలలో దాతల సహకారంతో సర్పంచి డొక్కు సోమేశ్వరరావు ఆధ్వర్యంలో 60 మంది విద్యార్థులకు విద్యా సామగ్రిని శుక్రవారం పంపిణీ చేశారు. సర్పంచి డొక్కు సోమేశ్వరరావు, మాజీ ఉప సర్పంచి కోరా రామ్మూర్తి నాయుడు, సరాబు ముకేష్ సుమారు రూ. 20 వేల విలువైన నోట్ బుక్స్, పలకలు, ప్యాడ్స్ పంపిణీ చేశారు.