ప. గో. జిల్లాలో ఆక్వా, ఇతర పంట ఉత్పత్తులను త్వరితగతిన మార్కెట్‌కు తరలించేలా కిసాన్ రైలు ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ఉండి మండలం వాండ్రంలో రూ. 10 కోట్లతో నిర్మించిన ఏపీ ఫిషరీస్ ట్రేడర్స్, ప్యాకర్స్ అసోసియేషన్ భవనాన్ని శనివారం ప్రారంభించారు. ఏపీలో ఆక్వా పరిశ్రమ సుదీర్ఘకాలం మనుగడ సాగించేలా విధి విధానాలు రూపొందించాలని ఆ రంగంలో వివిధ విభాగాల ప్రతినిధులకు సూచించారు.