కోళ్లపర్రు నుండి వరద బాధితులకు ఆహారం పంపిణీ

80చూసినవారు
కోళ్లపర్రు నుండి వరద బాధితులకు ఆహారం పంపిణీ
ఆకివీడు మండల కోళ్లపర్రు గ్రామం నుండి జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకుల సహకారంతో 5000 పులిహోర ప్యాకెట్లు విజయవాడ పంపించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ జుత్తుక నాగరాజు జండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని చోట్ల నుండి వరద బాధితులకు సహాయ సహకారాలు అందడం అభినందనీయమని అన్నారు.

సంబంధిత పోస్ట్