ఉండిలోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో నేషనల్ కేరియర్ సర్వీస్ ఆధ్వర్యంలో గురువారం జాబ్ మేళా జరిగింది. ఈ కార్యక్రమంలో 23 కంపెనీలు పాల్గొన్నాయి. మొత్తం 383 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో 308 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఈ విషయాన్ని ఐటీఐ ప్రిన్సిపల్ వేగేశ్న శ్రీనివాస్ రాజు వెల్లడించారు.