కాళ్ళ మండలం బోస్ కాలనీ 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో నూతన 11 కేవీ లైన్ ఏర్పాటు పనుల కారణంగా ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎన్. వెంకటేశ్వరరావు తెలిపారు. మాలవానితిప్ప, గోగుతిప్ప, ఆనందపురం, ఇస్కుల్లంక, మేకలదిబ్బ, గూట్లపాడు గ్రామాల్లో పవర్ కట్ ఉంటుందన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.