కాళ్ల: గ్రామాల అభివృద్ధే లక్ష్యం: డిప్యూటీ స్పీకర్

58చూసినవారు
కాళ్ల: గ్రామాల అభివృద్ధే లక్ష్యం: డిప్యూటీ స్పీకర్
గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు అన్నారు. కాళ్ల మండలం కోపల్లెలో సుమారు రూ. 40లక్షలతో నిర్మించిన నూతన సచివాలయ భవనం, కాళ్ల గ్రామంలో సుమారు రూ. 26 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలను సైతం పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్