కాళ్ల మండలం కలవపూడి గ్రామంలో శ్రీ ఉమా భీమేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు, ప. గో. జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.