కాళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బహిరంగంగా మద్యం తాగుతున్న ముగ్గురు వ్యక్తులను శనివారం రాత్రి అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బహిరంగంగా మద్యం తాగినా, మద్యం తాగి వాహనం నడిపినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా ఈ తరహా ఘటనలపై నిఘా పెంచామన్నారు.