ఖరీఫ్ ఈ-పంట నమోదును త్వరితగతిన పూర్తిచేయాలి

67చూసినవారు
ఖరీఫ్ ఈ-పంట నమోదును త్వరితగతిన పూర్తిచేయాలి
కాళ్ళ మండలం పెద్ద అమిరం పుంత రోడ్డులో ఈ -పంట నమోదు కార్యక్రమాన్ని ఆదివారం కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా పరిశీలించి, సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఖరీఫ్ సాగుకు సంబంధించి ఈ -పంట నమోదును రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రైతులు సాగు చేస్తున్న పంట వివరాల నమోదుతోనే పంటసాయం, పంటల భీమా, తదితర ప్రభుత్వ పథకాలు అందజేయడానికి వీలవుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్