విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని ఎంపీపీ పెన్మెత్స శిరీషవిశ్వనాధరాజు తెలిపారు. కాళ్ల మండలం కోపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు 'సన్నబియ్యం'తో ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని గురువారం ప్రారంభించారు. భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. భోజనం ఎలా ఉందో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.