కాళ్ళ: పెంచిన గ్యాస్ ధర వెంటనే తగ్గించాలని కాళ్ళ మండలం జువ్వలపాలెం సెంటర్ లో సిపిఎం శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి గొర్ల రామకృష్ణ మాట్లాడుతూ.. పెంచిన గ్యాస్ ధర వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. జనరల్ ఎన్నికల ముందర 200 తగ్గించి ప్రజలకి మేలు చేశామని పోజులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు ధరలు పెంచుతుందని మండిపడ్డారు.