కాళ్ల మండలం పెదఅమీరం గ్రామంలో ఖాదర్ ఎక్స్ పోర్ట్ ఫ్యాక్టరీ ఎదురుగా గల ఖాళీ స్థలంలో సుమారు 30 నుండి 35 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి శుక్రవారం మృతి చెందారు. సదరు వ్యక్తి ఒంటిపై నీలం రంగు ప్యాంట్, తెలుపు రంగు షర్టు ఉన్నాయి. నీలం రంగు డ్రాయరు, తెలుపు రంగు బనియన్ కలిగిన బట్టలు కలవు. కాగా, ఈ మృతదేహం పక్కనే అప్రో సైకిల్ పడి ఉన్నది. మృతడి సమాచారం తెలిసినవారు సంప్రదించాలని పోలీసులు తెలిపారు.