దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరుమీద నిర్మిస్తున్న ఓపెన్ ఎయిర్ థియేటర్ కు సోమవారం భూమి పూజ చేశారు.
కాళ్ల మండలం పెదఅమీరం గ్రామపరిధిలో భీమవరంకు సమీపంలో నిర్మాణం చేపట్టగా, కలెక్టర్ నాగరాణితో కలిసి ఏపీ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు భూమిపూజ చేశారు. సుమారు 80 సెంట్లు స్థలంలో పంచాయతీ, ఇద్దరు ఎంపీల నిధులు రూ. 70 లక్షలతో ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ తో కూడిన ఓపెన్ ఎయిర్ థియేటర్ ని 'ఎన్టీఆర్ కళావనం' పేరుతో నిర్మిస్తున్నట్లు తెలిపారు.