నేటితరం బాలికలకు బాసటగా ఉండే విధంగా నివేదిత విద్యాలయం ఏర్పాటు అభినందనీయమని గుంటూరులోని శారదామఠం అధ్యక్షురాలు ప్రవాజిక భవానీ ప్రాణ మాతాజీ అన్నారు. కాళ్ల మండలం పెదఅమిరంలోని వివేకానంద సేవాసమితి భవనం ప్రాంగణంలో నిర్మించిన నివేదిత విద్యాలయం సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ నాగరాణితో కలసి ప్రారంభించి మాట్లాడారు. బాలికలకు ఉచిత విద్య అందించాలనే లక్ష్యంతో కార్పొరేట్ స్థాయిలో ఏర్పాటు చేయడం శుభపరిణామం అన్నారు.