తణుకు పట్టణంలో ఆదివారం జరిగే అగ్రిగోల్డ్ బాధితుల విస్తృత స్థాయి సమావేశానికి ఆకివీడు నుండి మండల అగ్రిగోల్డ్ బాధితుల సంఘ అధ్యక్షులు ఇంటి వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో భీమవరం బ్రాంచ్ నుండి తణుకు పట్టణానికి ఆదివారం అగ్రిగోల్డ్ కస్టమర్స్ , ఏజెంట్ లు బయలుదేరి వెళ్లారు. అగ్రిగోల్డ్ బాధితులకు వారికి రావలసిన ప్రతి రూపాయిని కస్టమర్లకు అందించడమే మా ప్రధాన లక్ష్యం అని ఇంటి వీర వెంకట సత్యనారాయణ తెలిపారు.