కాళ్ళ మండలం పాతాళ్లమెరక గ్రామంలో కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే రఘురామకృష్ణారాజు ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా ‘గ్రామఆరోగ్య వైద్యశాల’ పరిశీలించి సిబ్బందితో మాట్లాడి సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంచినీటి చెరువులను పరిశీలించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు తదితరులు పాల్గొన్నారు.