ఉండి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బీజేపి మండల నూతన కార్యవర్గ సమావేశం బుధవారం రాత్రి జరిగింది. ఈ సమావేశానికి మండల అధ్యక్షులు యర్రా విక్రమ్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిలుగా జిల్లా అధ్యక్షులు ఐనంపూడి శ్రీదేవి, పార్లమెంట్ ఇన్‌ఛార్జి పేరిచర్ల సుభాష్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధికి అగ్రస్థానం ఇస్తున్నట్లు తెలిపారు.